- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: సెంచరీతో మెరిసిన అభిషేక్ శర్మ.. భారీ స్కోరు దిశగా హైదరాబాద్
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు ఉప్పల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు ఉప్పల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు అభిషేక్, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఉతికేస్తూ మెరుపు ఇన్నింగ్స్‌తో హోమ్ గ్రౌండ్‌ను హోరెత్తించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(47 బంతుల్లో 104 పరుగులు) కేవలం బౌండరీలతోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ సెంచరీ మార్కును చేరుకుని ఆరెంజ్ ఆర్మీ అభిమానులను ఖుషీ చేశారు. ఎదుర్కొన్న ప్రతి బౌలర్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ, స్టేడియం నలుమూలల బంతిని తరలిస్తూ విధ్వంసం సృష్టించారు. అభిషేక్ శర్మ ఇచ్చిన ఊపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం భారీ స్కోరు చేసే దిశగా దూసుకుపోతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అభిషేక్ ధాటికి తేలిపోయారు. వికెట్ల వేటలో విఫలమవడమే కాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇదే జోరు కొనసాగితే ఢిల్లీ ముందు హైదరాబాద్ హిమాలయమంత లక్ష్యాన్ని ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది.






