Shreyas Iyer : పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు బిగ్ షాక్‌..!

by velandi.Saikiran |   (  Updated:2026-04-01 12:28:46  IST  )

పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పై రూ.12 ల‌క్ష‌ల ఫైన్ వేసింది ఐపీఎల్ యాజ‌మాన్యం.

Shreyas Iyer : పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు బిగ్ షాక్‌..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. శ్రేయాస్ అయ్యర్ కు భారీ ఫైన్ వేసింది ఐపీఎల్ కౌన్సిల్. ఐపీఎల్ 2026 లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్, గుజరాత్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలింగ్ చేసే క్ర‌మంలో స్లో ఓవర్ రేట్ చోటు చేసుకుంది. దీంతో కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ పై వేటు వేశారు. ఏకంగా రూ.12 లక్షల ఫైన్ వేసింది ఐపీఎల్ కౌన్సిల్.

ఇది ఇలా ఉండగా మంగళవారం పంజాబ్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో చివరి క్షణంలో విజయం సాధించింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 162 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పోరాడిన పంజాబ్ కింగ్స్, ఏడు వికెట్ల నష్టానికి 19.1 ఓవర్లలో విజ‌యం సాధించింది. అటు ఇదే మ్యాచ్ లో కాన్లీ కొట్టిన బంతి నేరుగా మ‌రో ఎండ్ లో అయ్య‌ర్ చేతికి త‌గిలింది. దీంతో అయ్య‌ర్ చేతికి గాయం అయింది. ఆ గాయం తీవ్ర త‌రం అయితే, త‌ర్వాత మ్యాచ్ కు శ్రేయాస్ అయ్య‌ర్ దూరం అయ్యే ప్ర‌మాదం పొంచి ఉంది.

వైభ‌వ్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక

Next Story