- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రెండు జట్ల మధ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్!
<p>దిశ, స్పోర్ట్స్ : యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 13 సీజన్ షెడ్యూల్ ఇంత వరకు అధికారికంగా విడుదల కాలేదు. అయితే తొలి మ్యాచ్ పాత షెడ్యూల్ ప్రకారమే ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు వీడ్కోలు పలికిన సందర్భంగా అతడిని కీర్తిస్తూ ముంబై ఇండియన్స్ (MI) జట్టు […]</p>

దిశ, స్పోర్ట్స్ : యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 13 సీజన్ షెడ్యూల్ ఇంత వరకు అధికారికంగా విడుదల కాలేదు. అయితే తొలి మ్యాచ్ పాత షెడ్యూల్ ప్రకారమే ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు వీడ్కోలు పలికిన సందర్భంగా అతడిని కీర్తిస్తూ ముంబై ఇండియన్స్ (MI) జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ట్వీట్ చేశాడు.
‘భారత క్రికెట్ చరిత్ర (History of Indian Cricket)లో అత్యంత ప్రతిభావంతుడైన వ్యక్తి క్రికెట్‌కు వీడ్కోలు (Farewell to cricket) పలికాడు. అతని ప్రభావం క్రికెట్‌తో పాటు బయట కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఒక జట్టు (Team)ను తయారు చేయడంలో అతనికి ఉన్న ప్రతిభను ఎవరూ మర్చిపోలేదు. నిజంగా నిన్ను మిస్ అవుతున్నాము. బ్లూ కలర్ (Blue color jersy)లో నిన్ను చూడలేక పోవచ్చేమో కానీ పసుపు రంగులో (yellow jersy) నువ్వింకా ఉంటావు. 19న టాస్ (Toss) కోసం ఎదురు చూస్తున్నాను’ అని రోహిత్ పోస్టు పెట్టాడు.
సెప్టెంబర్ 19న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. టాస్‌కు కెప్టెన్లు మాత్రమే వెళ్తారు. అంతే ఆ రోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ జరగడం ఖాయం అని అందరూ ఊహిస్తున్నారు. రోహిత్ ముందుగానే తొందరపడి షెడ్యూల్ లీక్ చేశాడని కూడా క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.






