ఆ ఇద్దరినే రిటైన్ చేసుకుంటున్న SRH టీమ్

by  |
ఆ ఇద్దరినే రిటైన్ చేసుకుంటున్న SRH టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2022 కోసం BCCI జనవరిలో మెగా వేలం నిర్వహించనుంది. ఈ నెలాఖరులోగా ఆయా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు ప్రకటించాలని డెడ్ లైన్ విధించింది.

IPL 2021 సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేసి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారి పూర్తిగా కొత్త జట్టుతో బరిలోకి దిగనుంది. గత సీజన్‌లోనే పేలవ ఫామ్‌తో కెప్టెన్సీ సహా జట్టులో చోటు కూడా కోల్పోయిన డేవిడ్ వార్నర్‌ను ఫ్రాంచైజీ రిటెన్షన్ చేసుకోవడం లేదు. అంతే కాకుండా జట్టులోని ఏ స్వదేశీ ఆటగాడిని కూడా తీసుకోవడానికి ఫ్రాంచైజీ సిద్దంగా లేదు. కేవలం కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, అఫ్గానిస్తాన్ మిస్టరీ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను మాత్రమే తీసుకోవాలని సన్‌రైజర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. BCCI రిటెన్షన్ పాలసీ ప్రకారం ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే మొదటి ప్లేయర్‌కు 14 కోట్లు, రెండవ ప్లేయర్‌కు 10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

రాబోయే మెగా వేలంలో ప్రతీ జట్టుకు 90 కోట్లు ప్లేయర్ పర్స్ వాల్యూ ఉంటుంది. గత ఏడాది కంటే 5 కోట్లు ఎక్కువ. SRH టీమ్ కేన్ విలియమ్‌సన్, రషీద్ ఖాన్‌కు 24 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఇంకా 66 కోట్లు మిగులు ఉంటుంది. ఈ డబ్బును ఉపయోగించి వేలంలో నాణ్యమైన, ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చని భావిస్తుంది. ముఖ్యంగా వేలంలో ఉంటే KL రాహుల్, శ్రేయస్ అయ్యర్, పాండ్యా బ్రదర్స్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నది. మరి సన్‌రైజర్స్ మెగా వేలంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తుందో వేచి చూడాలి.


Next Story

Most Viewed