13 రెట్లు పెరిగిన ఐవోసీ లాభాలు

50

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఇంధన కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం ఏకంగా 13 రెట్లు వృద్ధితో రూ. 6,025.81 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో సంస్థ రూ. 468.04 కోట్ల లాభాలను ఆర్జించింది.

సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ ఏకీకృత ఆదాయం 13.39 శాతం తగ్గి రూ. 1.29 లక్షల కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయం గతేడాది నమోదైన రూ. 449.09 కోట్లను ఈసారి రూ. 1,157.99 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. త్రైమాసిక ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఐవోసీ షేర్లు మిడ్ సెషన్ సమయానికి 2.55 శాతం పెరిగి రూ. 80.45 వద్ద ట్రేడయింది.