ఇదేం వనం..? కనిపించని పచ్చదనం!

by  |
ఇదేం వనం..? కనిపించని పచ్చదనం!
X

దిశ, ఇబ్రహీంపట్నం: పట్టణాల మాదిరిగానే పల్లెల్లోనూ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించి వనాలను పెంచే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు కొన్ని గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచుతుంటే .. కొన్ని ఊర్లలో ఎండిపోయి దర్శన మిస్తు న్నాయి. అధికారుల నిర్ల క్ష్యం.. నాయకుల అలసత్వంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులపై కలెక్టర్ వేటు వేసినా తీరు మారడం లేదు. పల్లె ప్రకృతి వనాలపై దిశ ప్రత్యేక కథనం..

మంచాల మండలంలోని మంచాల, ఆరుట్ల మొదలైన గ్రామాల్లో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం కళకళ లాడుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నా యి. దాద్‌పల్లి, చిత్తాపూర్ గ్రామాల్లో నాటిన మొక్కలు ఎండి దర్శనమిస్తున్నాయి. మచ్చుకైన పచ్చదనం కనపడటం లేదు. మొక్కలు ఎదిగే సమయంలో సంరక్షించక పోవడంతో పూర్తిగా ఎండిపోయాయి. ఈ గ్రామా ల్లో వనాలను చూస్తే అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కొ ట్టొచ్చినట్టు కనబడుతుంది. మొక్క నాటిన తర్వాత మ ట్టిని పూడ్చకుండ మొక్కలను అలాగే గుంతలో వదిలేశారు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు విడుదల చేస్తుంటే ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామాలను సైతం సుం దరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని స్థానిక సర్పంచ్లు,అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా నీరుగారుస్తున్నారంటున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాద్ పల్లి గ్రామంలో లక్షలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన పల్లె పకృతి వనంలో జెడ్పీటీసీ మర్రి నిత్యా నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా సుమారు 300 మెక్కలను నాటారు. సర్పంచ్ స్థా నికంగా ఉండకపోవడం, పంచా యతీ సిబ్బంది కొరత కారంణంగా హరితహారం మెక్కలు, పల్లె పకృతి వనంలో నాటిన మొక్కలు పూర్తిగా ఎండిపోయాని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని గ్రామ ప్రజలు,రాజకీయ నాయకులు, గ్రామ పంచాయితీ వార్డు మెంబర్లు ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ సుడిగాలి పర్యటనలు చేస్తూ అలసత్వం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్‌లకు నోటీసులిస్తు పలువురిని సస్పెండ్‌ చేస్తున్న కొంతమంది అధికారుల,ప్రజ ప్రతినిధుల తీరులో మార్పు రావడం లేదు. సర్పంచ్ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామ సభలకు కూడా సకాలంలో నిర్వహించడం లేదని,తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రా మస్తులు, వార్డు సభ్యులు మండిపడుతున్నారు.

మొక్కలు ఎండిపోయాయి…

సర్పంచ్ స్థానికంగా గ్రామంలో ఉండకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. పం చాయతీ సమావేశాలకు నిర్ణీత సమయంలో ఏర్పాటు చేయ రు. పల్లె పకృతి వనంలో మొక్కలు నాటి సంరక్షించకపోవడంతో అవి ఎండిపోయాయి. -సునీత, వార్డు నెంబర్

అధికారులు పట్టించుకోవడం లేదు..క్షేత్రస్థాయిలో అధికారులు, సర్పంచ్ లు పట్టించుకోవడం లేదు.మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. రెం డు సంవత్సరాల కాలంలో నలుగురు కార్యదర్శులు మారారు. -సంధ్య, వార్డు నెంబర్


Next Story

Most Viewed