RRR క్లైమాక్స్‌పై ఇంట్రెస్టింగ్ గాసిప్స్..హీరోలు ఏం కోల్పోతారో తెలుసా?

by  |
RRR క్లైమాక్స్‌పై ఇంట్రెస్టింగ్ గాసిప్స్..హీరోలు ఏం కోల్పోతారో తెలుసా?
X

దిశ, సినిమా: RRR సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్‌ కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులుగా కనిపించనున్న ఈ సినిమా కల్పిత కథగా తెరకెక్కుతోంది. భీమ్, రామరాజు కలిసి బ్రిటిషు వాళ్లను ఎలా ఎదిరించేవారన్న ఇమాజినేషన్‌తో వస్తున్న ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోనుందట.

ఈ మధ్యే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా జక్కన్న వెల్లడించగా..దీనిపై ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. క్లైమాక్స్‌లో భీమ్, రామరాజులలో ఒకరికి కళ్లు, మరొకరికి కాళ్లు పోతాయని..ఆ సమయంలో తమ బలహీనతలను బలంగా చేసుకున్న హీరోలు ఎలా పోరాడారనేది జక్కన్న క్లైమాక్స్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదలవుతున్న సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రీయా శరణ్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.


Next Story

Most Viewed