అంతరాష్ట్ర సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

by  |

దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర మానవ అక్రమ రవాణ చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన చిన్నా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శివకుమార్ ఇతర ప్రాంతాలలో మానవ అక్రమ రవాణా నిర్వహించే వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల పేరిట యువతులను హైదరాబాద్ తీసుకువచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దందా నడిపిస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ కు చెందిన వారే ఉన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఎంపికైన కస్టమర్లకు ఈ యువతులను బుక్ చేసి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి శివకుమార్‌ను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు చిన్నా పరారీలో ఉన్నాడు.

Next Story

Most Viewed