Personal Loans: తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్.. నెలకి రూ.5 లక్షలకి ఎంత EMI? వివరాలివే…

by  |
banks
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. వినియోగదారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత చాలామంది ఆర్థికంగా కుదేలైపోయారు. దీంతో వారు బ్యాంకు రుణాల కోసం చూస్తున్నారు. వ్యక్తిగత రుణాలను తీసుకొని తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతున్నారు. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తూ తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎంత వడ్డీతో రుణాలు ఇస్తున్నాయో ఓసారి చూద్దాం.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 8.95 శాతం, ఐసీఐసీఐ బ్యాంకులో 10.5 శాతం, ఎస్‌బీఐలో 9.6 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 10 శాతం, ఐడీబీఐ 9.6 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 10.25 శాతం ప్రారంభం వడ్డీరేటు, ఎస్ బ్యాంకులో 10.40 శాతం, యూనియన్‌ బ్యాంకులో వడ్డీ రేటు 8.9 శాతం నుంచి ప్రారంభమవుతోంది. ఐదు సంవత్సరాల కాలపరిమితితో ఈఎంఐ పద్దతిలోనూ చెల్లించుకోవచ్చు. అయితే రూ.5 లక్షల రుణం తీసుకుంటే రూ.10,355 ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. ఇక రూ.5 లక్షల రుణంపై ఐదు సంవత్సరాల పాటు ఎంత ఈఎంఐ చెల్లించాలో చూద్దాం.

బ్యాంకులవారీగా వివరాలు..

ఐసీఐసీఐ బ్యాంకు 10.50 శాతం వడ్డీ – నెలకు రూ.10,747

పంజాబ్‌ అండ్‌ సింధు బ్యాంక్‌ 9.50 వడ్డీ శాతం – నెలకు రూ.10,501

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 10.25 శాతం వడ్డీ – నెలకు రూ.10,685

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 8.95 శాతం వడ్డీతో నెలకు రూ.10.367

యూనియన్‌ బ్యాంకు 8.90 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.10,355

సెంట్రల్‌ బ్యాంకు 8.90 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.10.355

ఇండియన్‌ బ్యాంకు 9.05 శాతం వడ్డీ – నెలకు రూ.10.391

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 9.45శాతం వడ్డీ – నెలకు రూ.10.489

ఐడీబీఐ బ్యాంకు 9.50 శాతం వడ్డీ- నెలకు రూ.10,501

ఎస్‌బీఐ 9.60 శాతం వడ్డీ – నెలకు రూ.10,525

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 10 శాతం వడ్డీ – నెలకు రూ.10,624

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 10.35 శాతం – నెలకు రూ.10.710

*పైన ఇచ్చిన వివరాలన్ని ప్రాథమిక సమాచారం మాత్రమే. బ్యాంకు వడ్డీ శాతం, ఈఎంఐలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది కావున పూర్తి వివరాలకొసం బ్యాంక్ లలో సంప్రదించగలరు.

ఆ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయా ?.. అయితే మీరే కోటీశ్వరులు


Next Story

Most Viewed