పొలంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-13 00:21:56  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని కొత్తూరు మండలం పొనుగూరులో గురువారం రాత్రి చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పొలంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఆకాశ్, విలియంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి [&hellip;]</p>

పొలంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని కొత్తూరు మండలం పొనుగూరులో గురువారం రాత్రి చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పొలంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఆకాశ్, విలియంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుల వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story