లారా కేసు సుఖాంతం..

by  |
లారా కేసు సుఖాంతం..
X

దిశ,వెబ్ డెస్క్: ఇంటర్ విద్యార్థిని లారా కేసు సుఖాంతం అయింది. ఆదివారం ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా తల్లిదండ్రులు మందలించారంటూ హయత్ నగర్ తట్టి అన్నారానికి చెందిన లారా మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం తల్లిదండ్రులు అంతటా గాలించారు. కానీ ఆచూకీ దొరకలేదు. దీంతో హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఆమె ఇంటికి తిరిగి రావడంతో కథ సుఖాంతం అయింది.


Next Story

Most Viewed