ఐటీ దాడులు.. మాజీ సీఎం సన్నిహితుడి ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం

by  |
IT executives
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో బెంగళూరు నగరంలో ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం ఏకకాలంలో 50 చోట్ల దాడులు చేస్తూ.. కలకలం సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సన్నిహితుడు ఉమేశ్ నివాసంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉమేశ్ కార్యాలయాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమచారం. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, చార్టడ్ అకౌంటెంట్ల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. బృందాలుగా విడిపోయిన 300 మంది ఐటీ అధికారులు చేస్తోన్న తనిఖీలపై ఉత్కంఠ నెలకొంది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో 120 కి పైగా కార్లను అధికారులు సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed