- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నై నుంచి వచ్చాడు.. ఏటీఎంను తగలబెట్టాడు
by Batti.Sumithra |
<p>దిశ, మునుగోడు: చెన్నై నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఏటీఎంకు నిప్పంటించిన ఘటన మంగళవారం రాత్రి సంస్థాన్ నారాయణాయపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. చెన్నై నుంచి రైలులో వచ్చి హైదరాబాద్ లో దిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్లాలో తెలియక నడుచుకుంటూ నారాయణపురంకు చేరుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఎక్కడ ఆహరం దొరకక 3 రోజుల నుంచి ఏమీ తినకపోవడంతో మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి ఎదురుగా ఉన్న ఇండిక్యాష్ ఏటీఎంకు పెట్రోల్ పోసి […]</p>

X
దిశ, మునుగోడు: చెన్నై నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఏటీఎంకు నిప్పంటించిన ఘటన మంగళవారం రాత్రి సంస్థాన్ నారాయణాయపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. చెన్నై నుంచి రైలులో వచ్చి హైదరాబాద్ లో దిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్లాలో తెలియక నడుచుకుంటూ నారాయణపురంకు చేరుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఎక్కడ ఆహరం దొరకక 3 రోజుల నుంచి ఏమీ తినకపోవడంతో మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి ఎదురుగా ఉన్న ఇండిక్యాష్ ఏటీఎంకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ వ్యక్తికి మతిస్థిమితం లేక ఇలా ప్రవర్తించాడని స్థానిక ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ ఘటనలో ఏటీఎం పాక్షికంగా తగలబడిందని, అతడిని చౌటుప్పల్ లోని అమ్మ-నాన్న అనాథ ఆశ్రమానికి తరలించామని ఎస్సై తెలిపారు.
Next Story






