- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో దళితుల పట్ల అన్యాయం..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పలు ఘటనల్లో అగ్రకూలాల వారిపై కేసులు ఎత్తివేశారని.. దళితులపై ఉన్న ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ.. చీరాలకు చెందిన కిరణ్ కేసును విచారణ వచ్చే సమయానికి ఉపసంహరించుకున్నారని.. దీంతో ఆ కేసులో తానే పిల్ వేయాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో దళితుల దాడుల కేసుల్లో న్యాయం జరగడం లేదని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పలు ఘటనల్లో అగ్రకూలాల వారిపై కేసులు ఎత్తివేశారని.. దళితులపై ఉన్న ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ.. చీరాలకు చెందిన కిరణ్ కేసును విచారణ వచ్చే సమయానికి ఉపసంహరించుకున్నారని.. దీంతో ఆ కేసులో తానే పిల్ వేయాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో దళితుల దాడుల కేసుల్లో న్యాయం జరగడం లేదని ఎద్దేవా చేశారు. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు జైల్లో వేశారని విమర్శించారు. రిలయన్స్ మాల్స్‌పై దాడులు, ముస్లిం యువతపై పెట్టిన కేసులు ఎత్తివేశారని ఆరోపించారు.
Next Story






