- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట..!
by Ramesh Goud |
<p>దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో రూ. 15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడేళ్లలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో వైకుంఠధామం, చెత్తసేకరణ కేంద్రాలు, సీసీ రోడ్లు, ఆర్వో ప్లాంట్లు లాంటి మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట […]</p>

X
దిశ, పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో రూ. 15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడేళ్లలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో వైకుంఠధామం, చెత్తసేకరణ కేంద్రాలు, సీసీ రోడ్లు, ఆర్వో ప్లాంట్లు లాంటి మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు. ఇక రెవెన్యూ వ్యవస్థలో నూతన శకానికి సీఎం కేసీఆర్ నాంది పలకడం హర్షణీయమన్నారు.
Next Story






