బడ్జెట్ రేంజ్‌లో.. స్పెషల్ ఫీచర్డ్ ఇన్ఫినిక్స్ ‘స్మార్ట్ 5’

by  |
బడ్జెట్ రేంజ్‌లో.. స్పెషల్ ఫీచర్డ్ ఇన్ఫినిక్స్ ‘స్మార్ట్ 5’
X

దిశ, ఫీచర్స్ : గతేడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఇన్ఫినిక్స్ ‘స్మార్ట్ 5’ మొబైల్ కస్టమర్లను తన ఫీచర్స్‌తో మెస్మరైజ్ చేసింది. హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్.. తాజాగా ఈ ‘స్మార్ట్ 5’ మొబైల్‌ను బడ్జెట్ రేంజ్‌లో భారతీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆక్టాకోర్ ప్రాసెసర్, డ్యూయల్ రియర్ ఏఐ కెమెరాస్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఆకట్టుకునే అంశాలు. ఇక ఫోన్ స్టాండ్‌బై సమయం 50 రోజులుగా పేర్కొన్న కంపెనీ.. 2జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజీ సామర్థ్యంతో సింగిల్ వేరియంట్‌లో వచ్చిన ఈ ఫోన్ ధరను రూ. 7,199/-గా నిర్ణయించింది. 6.82 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో బ్లూ, గ్రీన్, బ్లాక్, పర్పుల్ కలర్స్‌లో లభించనున్న ఈ ఫోన్.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు అందుబాటులో ఉంది.

ఫీచర్స్ :
డిస్‌ప్లే : 6.82 అంగుళాల హెచ్‌డీ ప్లస్
ప్రాసెసర్ : ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జీ25 ఎస్ఓసీ
మొమొరీ : 2 జీబీ +32 జీబీ, Expandable upto 256 జీబీ
రియర్ కెమెరా : 13 ఎంపీ డ్యూయల్ ఏఐ
ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ


Next Story

Most Viewed