సేవాలాల్ సమాజ మార్గదర్శి: అల్లోల

by Shyam |   (  Updated:2020-02-15 07:40:28  IST  )

<p>         సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సమాజ మార్గదర్శి అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దేవినగర్ తండాలో నిర్వహించిన సేవాలాల్ 281 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి బంజారా మహిళలు వారి సాంప్రదాయంలో స్వాగతం పలికారు. బంజారా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ.. వారి ఆరాధ్య దైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని తండాల్లోను [&hellip;]</p>

సేవాలాల్ సమాజ మార్గదర్శి: అల్లోల
X

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సమాజ మార్గదర్శి అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దేవినగర్ తండాలో నిర్వహించిన సేవాలాల్ 281 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి బంజారా మహిళలు వారి సాంప్రదాయంలో స్వాగతం పలికారు. బంజారా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ.. వారి ఆరాధ్య దైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని తండాల్లోను సేవాలల్ మందిరాల కోసం నిధులు మంజూరు చేశామన్నారు.

Next Story