రేపు IGNO ప్రవేశ పరీక్ష

by  |
Indira Gandhi National Universal University
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) దేశ వ్యాప్తంగా ఎంబీఏ, బీఎస్సీ (నర్సింగ్), బీఈడీ కోర్సులలో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్. ఫయాజ్ అహ్మద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 120 పరీక్షా కేంద్రాలలో 40,170 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారని తెలిపారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం నుండి 462 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతుండగా, నిజాం కాలేజ్‌ను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను www.ignou.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు కనీసం 45 నిమిషాలు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.


Next Story