- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో తొలి బుల్లెట్ రైల్ ‘ఫస్ట్ లుక్’ అదుర్స్: డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
భారత రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలుకు సంబంధించిన అధికారిక ‘ఫస్ట్ లుక్’ వీడియోను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు (India's First Bullet Train)కు సంబంధించిన అధికారిక ‘ఫస్ట్ లుక్’ (First Look) వీడియోను విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏరోడైనమిక్ డిజైన్‌తో మెరిసిపోతున్న ఆ ట్రైన్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ముంబై-అహ్మదాబాద్ (Mumbai-Ahmedabad Bullet Train Project) మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జపాన్ సహకారంతో భారత్ నిర్మిస్తోంది. ఇవాళ విడుదల చేసిన ఈ తాజా వీడియోలో బుల్లెట్ రైలు ఎక్స్‌టీరియర్ ఆరెంజ్, బ్లాక్, క్రీమ్ వైట్ కలర్స్‌తో ఉంది. వేగానికి అనుగుణంగా రూపొందించిన ట్రైన్ ముందు ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ బుల్లెట్ రైలు గంటకు గరిష్టంగా 320 కి.మీ వేగంతో ప్రయాణించనుంది. దీందతో ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాక్ నిర్మాణం, అండర్ వాటర్ టన్నెల్స్, స్టేషన్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.






