- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు వారాల్లో ఎగుమతులు 11 శాతం వృద్ధి!
<p>దిశ, వెబ్‌డెస్క్: 2021 ఏడాది జనవరి 14తో ముగిసిన మొదటి 15 రోజుల్లో భారత ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 10.92 శాతం పెరిగి సుమారు రూ. 87.3 వేల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ముఖ్యంగా ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ రంగాల వృద్ధికి దారితీసింది. ఈ వృద్ధి కార్యకలాపాల పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. అదేవిధంగా జనవరిలో 1 నుంచి 14వ తేదీల మధ్య కాలంలో దిగుమతులు 6.58 శాతం పెరిగి సుమారు రూ. 1.33 లక్ష కోట్లకు చేరుకున్నాయి. ఈ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: 2021 ఏడాది జనవరి 14తో ముగిసిన మొదటి 15 రోజుల్లో భారత ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 10.92 శాతం పెరిగి సుమారు రూ. 87.3 వేల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ముఖ్యంగా ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ రంగాల వృద్ధికి దారితీసింది. ఈ వృద్ధి కార్యకలాపాల పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. అదేవిధంగా జనవరిలో 1 నుంచి 14వ తేదీల మధ్య కాలంలో దిగుమతులు 6.58 శాతం పెరిగి సుమారు రూ. 1.33 లక్ష కోట్లకు చేరుకున్నాయి. ఈ పెరుగుదలకు ముఖ్యంగా బంగారం, ముత్యాలు, విలువైన రత్నాలు దోహదపడ్డాయి. సమీక్షించిన ఈ కాలంలో బంగారు దిగుమతుల విలువ సుమారు రూ. 3,345 కోట్లు పెరిగాయి. మూడు నెలల తర్వాత డిసెంబర్‌లో భారత ఎగుమతులు వృద్ధిని సాధించాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు ఎగుమతులు పుంజుకోవడంతో వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాల్లో పెట్రోలియం, చమురు మినహా ఎగుమతులు 16.07 శాతం పెరగ్గా, పెట్రోలియం మినహా దిగుమతులు 18.78 శాతం పెరిగాయి.






