ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ ఊపందుకుంది: పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్!

by  |

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వేగవంతగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ పురోగతి, పండుగ సీజన్, వినియోగదారులతో పాటు పరిశ్రమల సెంటిమెంట్ మెరుగ్గా ఉండటంతో భారత ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకుంది. ఈ మేరకు పీహెచ్‌డీ ఛామబర్ ఆఫ్ కామర్స్(పీహెచ్‌డీసీసీఐ) ఆదివారం వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌కు సంబంధించి ఎకానమీ జీపీఎస్ సూచీ 113.1 నుంచి 131కి పెరిగింది. అయితే, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులకు మద్దతిచ్చేందుకు అధికంగా ఉన్న వస్తువుల ధరలు, ముడి పదార్థాల కొరతను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు ప్రదీప్ ముల్తానీ అన్నారు.

అలాగే, డిమాండ్‌ బలోపేతం కోసం దేశీయంగా ప్రజల వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ సూచీ ప్రధానంగా జీఎస్టీ వసూళ్లు, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు, స్టాక్ మార్కెట్ల వంటి కీలక అంశాల ఆధారంగా ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తుంది. జీఎస్టీ వసూళ్లు వ్యాపార కార్యకలాపాల వృద్ధిని సూచిస్తున్నాయని, ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఆర్థికవ్యవస్థలో డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని, అదేవిధంగా మార్కెట్లలో దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపరుస్తోందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన నివేదికలో వెల్లడించింది.

Next Story