13 శాతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు!

by  |

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో భారత వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు 13 శాతం పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సమీక్షించిన కాలంలో మొత్తం రూ. 1.75 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదురైన లాజిస్టిక్ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఎనిమిది నెలల కాలంలో వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం గమనార్హం. సమీక్షించిన కాలంలో బియ్యం ఎగుమతులు రూ. 45 వేల కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం వృద్ధి చెందాయి.

అలాగే, ఈ ఎనిమిది నెలల కాలంలో మాంసం, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు 12 శాతం వృద్ధితో రూ. 20 వేల కోట్లుగానూ, పండ్లు, కూరగాయల ఎగుమతులు 12 శాతం పెరిగి రూ. 13 వేల కోట్లకు చేరుకున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. తృణ ధాన్యాలు, అంతర ప్రాసెస్ చేసిన పదార్థాల ఎగుమతులు 26 శాతం పెరిగి రూ. 10.6 వేల కోట్లకు చేరుకున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed