- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జస్ట్ ఫర్ ఛేంజ్.. మందేసి, చిందేస్తున్న మహిళలు!
<p>మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ‘వంటింటి కుందేళ్ల’ ముద్రతో ఇంట్లోనే మగ్గిపోయే దుస్థితి నుంచి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా దూసుకుపోతున్నారు. అదే క్రమంలో అభిరుచుల విషయంలోనూ, అనుకున్నది చేయడంలోనూ అన్ని సంకోచాలనూ విడిచిపెడుతున్నారు. ధూమపానం వంటి వాటికి అలవాటుపడుతున్నారు. అది తప్పా.. ఒప్పా.. అన్న సంగతి పక్కన పెడితే వారు వాటికి అలవాటుపడుతున్న కారణాలు మాత్రం అచ్చంగా మగవారు చెబుతున్నవే..! లాస్ట్ ఇయర్ కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన యువతులు, తిరిగి కాలేజీలు తెరవడం.. ఉద్యోగాలకు […]</p>

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ‘వంటింటి కుందేళ్ల’ ముద్రతో ఇంట్లోనే మగ్గిపోయే దుస్థితి నుంచి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా దూసుకుపోతున్నారు. అదే క్రమంలో అభిరుచుల విషయంలోనూ, అనుకున్నది చేయడంలోనూ అన్ని సంకోచాలనూ విడిచిపెడుతున్నారు. ధూమపానం వంటి వాటికి అలవాటుపడుతున్నారు. అది తప్పా.. ఒప్పా.. అన్న సంగతి పక్కన పెడితే వారు వాటికి అలవాటుపడుతున్న కారణాలు మాత్రం అచ్చంగా మగవారు చెబుతున్నవే..! లాస్ట్ ఇయర్ కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన యువతులు, తిరిగి కాలేజీలు తెరవడం.. ఉద్యోగాలకు వెళ్లడంతో మళ్లీ షూరు చేశారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఎక్కువగా కనిపించే యువతుల మద్యపానం, ధూమపానం ఇప్పుడు హైదరాబాద్, దాని శివారు ప్రాంతాల్లోనూ విస్తృతంగా కనిపిస్తోంది.
దిశ ప్రతినిధి, మేడ్చల్ : కళాశాల స్థాయిలోనే.. అంటే మైనర్లుగా ఉండగానే చాలా మంది అమ్మాయిలు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. బర్త్ డే పార్టీలు, వీకెండ్ పార్టీల్లో స్నేహితుల ఒత్తిడితో, సరదగా మొదలయ్యే మద్య, ధూమపానం చాలా మంది యువతుల్లో క్రమంగా అలవాటుగా మారుతున్నది. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాల్లో బీజీగా ఉండడం, ఏ వేళకు, ఏ స్థితిలో పిల్లలు ఇంటికి చేరుతున్నారో గమనించేందుకు ఎవరూ లేకపోవడం వారికి కలిసివస్తోంది. మొదట్లో సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి ఎగువ మధ్య తరగతి యువతుల్లో కూడా విస్తరిస్తున్నది.
పబ్ లు.. లాంజ్ కేరాఫ్..
మహానగరంలో దాదాపు 50కిపైగా పబ్‌లు, లాంజ్‌లు ఉన్నాయి. వీటన్నింటిలో వీకెండ్స్ లోనే కాదు మిగిలిన రోజుల్లోనూ పార్టీలు జరుగుతూ ఉంటాయి. గతంలో హోటల్స్ లో మాత్రమే పార్టీలు చేసుకునే యువత ఇప్పుడు మందు, విందు అందించే పబ్ లు, లాంజ్ లకు వెళ్లి మజా చేసుకుంటున్నారు. 18ఏళ్ల వయసు లోపు వాళ్లను పబ్ లు, లాంజ్ లలోకి అనుమతించకూడదు. కానీ, నిబంధనలను పట్టించుకునేవారే లేరు. పైగా.. పబ్ లలో మహిళల కోసం ప్రత్యేకంగా ఒకటి రెండు రోజులు కేటాయించి మరీ డిజే నైట్స్ ఏర్పాటు చేయడం మారుతున్న పరిస్థితికి నిదర్శనం. నిజానికి నేటి తరానికి తమ అలవాట్లతో కలిగే అనారోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకు ఈ వ్యసనాల భారీన పడుతున్నారంటే ఒత్తిడి, మితిమీరిన స్వేచ్ఛలే అందుకు కారణమని మనస్తత్వ శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.
ఒత్తిడి నుంచి ఉపశమనానికి..
పాశ్చత్య దేశాల్లో చదువుకుని, భిన్న సంస్కృతుల్లో పెరగడం, ఇంటికి దూరంగా, ఒంటరిగా ఉంటూ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల యువతుల్లో సైతం మద్యపానం, ధూమపానంపై గతంలో ఉన్న కట్టుబాట్లు సడలుతున్నాయి. విదేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యువతులు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. లక్షలాది మంది ఇక్కడి అమ్మాయిలు చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉంటున్నారు. అమ్మానాన్నలకు, ఇరుగుపొరుగుకు తెలిసిపోతుందేమోనన్న సంకోచం లేకపోవడంతో.. ఆసక్తి ఉన్న అమ్మాయిలు వాటిని రుచి చూస్తున్నారు. మరికొందరు యువతులు, వీకెండ్ పార్టీలకు వెళ్లినప్పుడు స్నేహితుల ఒత్తిడి మేరకు మద్యానికి ఓకే చెబుతున్నారు. కొందురు ఒకటి రెండు సార్లతో సరిపెట్టెస్తుంటే మరి కొందరు క్రమేపి వాటికి బానిసలవుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఒంటరితనంతో కలిగే దిగులు, పని ఒత్తిళ్ల నుంచి ఉప శమనానికి మద్యాన్ని, సిగరెట్లను అశ్రయిస్తున్నారు.
అటెన్షన్…
తల్లులు పొగతాగితే పుట్టబోయే బిడ్డలకు ప్రమాదమే. గర్బిణులు పొగతాగితే గర్భస్రావం కావడం లేదా నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పిల్లలు పుట్టే అవకావం ఉంది. మహిళలు పొగతాగితే ఆన్ ట్రయోపోరాసిస్ వచ్చే ప్రమాదముంది. ఒక సిగరెట్ తాగితే 4200 విషవాయువులు ఆవహిస్తాయి. కౌన్సెలింగ్‌కు వస్తున్న వాళ్లలో 35 ఏళ్లు దాటిన వాళ్లే ఎక్కువ. చాతి వైద్యం కోసం వచ్చి మృతి చెందుతున్న వారిలో 50 శాతం పొగ తాగేవారే ఉంటున్నారు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ తో ఎక్కువ మంది చనిపోతున్నారని చాతీ వైద్యుల నిపుణులు డాక్టర్ ప్రసాద్ చెబుతున్నారు.
ఇలా చేస్తే బెటర్…
– సిగరెట్ మానేయాలనుకుంటే ఆ క్షణం నుంచే మొదలు పెట్టాలి.
– సిగరెట్ తాగాలనిపించినప్పుడు చూయింగ్‌గమ్, చాక్లెట్స్ వాడాలి.
– ధూమపానం చేయాలనిపించినప్పుడు ఆ ధ్యాసను మరోవైపు మరల్చాలి.
– సిగరెట్‌పై ధ్యాస పోకుండా ధ్యానం, యోగా వంటివి చేయాలి.
– పొగ తాగడాన్ని తగ్గించుకోలేక పోతే ఫార్మాకో థెరపీని చేయించుకోవాలి.
– వైద్యుల వద్ద కౌన్సెలింగ్ చేయించుకోవడం మంచిది.






