- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూకేలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి
by B.Srinivas |
<p>ఇంగ్లండ్‌లో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పూణేకు చెందిన సిద్ధార్థ్ ముర్కుంబి(23) లండన్‌లోని లాంకషైర్ యూనివర్సిటీలో మార్కెటింగ్ కోర్సు చదువుతుండగా గత నెల 15న తప్పిపోయాడు. తాజాగా అతని మృతదేహం రిబ్బ్‌ల్ నది ఒడ్డున ఉండటాన్ని యూకే పోలీసులు గుర్తించారు. తమ కుమారుడు మరణవార్త తెలుసుకొని అతని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తాము యూకేకు రాలేమని, తమ కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు పంపించాలని అతని తల్లిదండ్రులు యూకే ప్రభుత్వాన్ని కోరారు. సిద్ధార్థ్ నదిలోకి దూకి ఆత్మహత్య […]</p>
ఇంగ్లండ్‌లో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పూణేకు చెందిన సిద్ధార్థ్ ముర్కుంబి(23) లండన్‌లోని లాంకషైర్ యూనివర్సిటీలో మార్కెటింగ్ కోర్సు చదువుతుండగా గత నెల 15న తప్పిపోయాడు. తాజాగా అతని మృతదేహం రిబ్బ్‌ల్ నది ఒడ్డున ఉండటాన్ని యూకే పోలీసులు గుర్తించారు. తమ కుమారుడు మరణవార్త తెలుసుకొని అతని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తాము యూకేకు రాలేమని, తమ కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు పంపించాలని అతని తల్లిదండ్రులు యూకే ప్రభుత్వాన్ని కోరారు.
సిద్ధార్థ్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారని మృతుడి తండ్రి శంకర్ తెలిపారు. మృతదేహాన్ని రాయల్ ప్రిస్టన్ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్టు పోలీసులు వెల్లడించారన్నారు.
Tags: indian student, death, uk, pune
Next Story






