- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యాతో భారత ఫార్మా కంపెనీల చర్చలు..
<p>దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని దేశాలు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా మేడ్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ పై భారత ఫార్మా కంపెనీలు స్పందించాయి. ఆ దేశంతో భారత్ దిగ్గజ ఫార్మా కంపెనీలు చర్చలు జరిపాయి. వ్యాక్సిన్ కు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని దేశాలు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
ఈ క్రమంలోనే రష్యా మేడ్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ పై భారత ఫార్మా కంపెనీలు స్పందించాయి. ఆ దేశంతో భారత్ దిగ్గజ ఫార్మా కంపెనీలు చర్చలు జరిపాయి. వ్యాక్సిన్ కు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ సమాచారం కావాలని కోరినట్లు రష్యా మీడియా ప్రకటించింది. దీంతో పాటే వ్యాక్సిన్ దేశీయ ఉత్పత్తి, ఎగుమతి అనుమతి కోరినట్లు రష్యా రాజధాని మాస్కోలోని రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Next Story






