- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయానికి ప్రతీక నేవీ డే.. ఈసారి లేనట్లే!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, విశాఖపట్నం : పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నిర్వహించే నేవీ డేను ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు తూర్పు నౌకాదళ అధికారులు తెలిపారు. నేవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భారీ స్ధాయిలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం వర్చువల్ విధానంలో వేడుకులను నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రతి ఏటా విశాఖ ఆర్కేబీచ్ వేదికగా నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని యుద్ధనౌకలు, […]</p>

X
దిశ, విశాఖపట్నం : పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నిర్వహించే నేవీ డేను ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు తూర్పు నౌకాదళ అధికారులు తెలిపారు. నేవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భారీ స్ధాయిలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం వర్చువల్ విధానంలో వేడుకులను నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వాస్తవానికి ప్రతి ఏటా విశాఖ ఆర్కేబీచ్ వేదికగా నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని యుద్ధనౌకలు, నేవీ సిబ్బంది విన్యాసాలు, రిహార్సల్స్ జరుగుతుంటాయి. కేవలం కరోనా నేపథ్యంలోనే ఈసారి విన్యాసాలను రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 3న విశాఖ తూర్పు నౌకదళం ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది.
Next Story






