చైనా దురాగతాలపై స్పెషల్ కవరేజ్.. మేఘా రాజగోపాలన్‌కు ‘పులిట్జర్’ అవార్డు..

by  |
indian journalist megha rajagopalan wins Pulitzer Prize for exposing Chinas vast infrastructure for detaining Muslims
X

న్యూఢిల్లీ : భారత సంతతి జర్నలిస్టు మేఘా రాజగోపాలన్‌కు అమెరికా అత్యున్నత జర్నలిజం అవార్డు పులిట్జర్ వరించింది. చైనాలో ముస్లింలను నిర్బంధించడానికి నిర్మించిన క్యాంపులపై రాసిన పరిశోధనాత్మక కథనాలకు గాను మరో ఇద్దరితో కలిసి ఆమె పురస్కారాన్ని పొందారు. అమెరికా మీడియా సంస్థ బజ్‌ఫీడ్‌లో ఆమె పనిచేస్తున్నారు. చైనాలో జిన్‌జియాంగ్ రీజియన్‌లోని క్యాంపులను తొలిసారి సందర్శించిన ఆమెపై ఆ దేశం ఆంక్షలు విధించింది.

సమాచారం బయటికి పొక్కకుండా చైనా ప్రయత్నించినప్పటికీ ఆ దేశంలోకి వెళ్లకుండానే మరో ఇద్దరితో కలిసి టెక్నాలజీ సహాయంలో గుట్టును ఛేదించారు. ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ కేటగిరీలో మేఘా పులిట్జర్ పురస్కారం గెలుచుకోగా, లోకల్ రిపోర్టింగ్ కేటగిరీలో తంపా బే టైమ్స్‌లో పనిచేస్తు్న్న భారత సంతతి జర్నలిస్టు నీల్ బేడీ జర్నలిస్టు కాథలీన్ మెక్‌గోరీతో కలిసి బహుమానం పొందారు.



Next Story

Most Viewed