వచ్చే ఏడాది రూ. 7.62 లక్షల కోట్లకు దేశీయ ఐటీ వ్యయం!

by  |
వచ్చే ఏడాది రూ. 7.62 లక్షల కోట్లకు దేశీయ ఐటీ వ్యయం!
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది(2022) దేశీయంగా ఐటీ కోసం వ్యయాలు రూ. 7.62 లక్షల కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని గార్ట్‌నర్‌ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఏడాది కంటే ఇది ఏడు శాతం అధికమని నివేదిక తెలిపింది. ‘కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భారీగా పెరుగుతున్న డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 2021 ప్రారంభంలో సెకెండ్ వేవ్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగవంతంగా కోలుకుంది.

2022లో భారత్‌లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు కొత్త ఐటీ ప్రాజెక్టుల కోసం నిధులు పొందడానికి టెక్నాలజీ పట్ల ఆసక్తి చూపిస్తారని’ గార్ట్‌నర్ రీసెర్చ్ వైస్-ప్రెసిడెంట్ అరుప్ రాయ్ అన్నారు. దేశీయ ఐటీ కంపెనీలు ప్రధానంగా కొత్త ఆవిష్కరణలు, ప్రస్తుతం ఉన్న వాటిని ఆధునీకరించే, ప్రాజెక్టులపై తమ వ్యయాన్ని పెంచే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. అలాగే, కొవిడ్ మహమ్మారి వల్ల ఈ మార్పులకు కారణం కావున, ఈ కొత్త అవసరాలను అందించేందుకు తగిన స్థాయిలో ఉద్యోగులను తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాయని నివేదిక తెలిపింది.

ఇక, 2022లో అన్ని విభాగాల్లో ఐటీ వ్యయం పెరుగుతుందని, సాఫ్ట్‌వేర్ విభాగం అత్యధికంగా ప్రస్తుత ఏడాది కంటే 14.4 శాతం పెరిగి రూ. 79 వేల కోట్లకు చేరుకోనుంది. ఇది కరోనాకు ముందు కంటే దాదాపు రెట్టింపు అని గార్ట్‌నర్ నివేదిక పేర్కొంది. అదేవిధంగా హైబ్రిడ్ వర్క్ విధానం పెరుగుతున్న క్రమంలో పరికరాలపై ఖర్చు 7.5 శాతం పెరిగి రూ. 3.29 లక్షల కోట్లకు పెరుగుతుందని, ఇది మొత్తం ఐటీ వ్యయంలో 43 శాతం ఉంటుందని నివేదిక అంచనా వేసింది.


Next Story

Most Viewed