ఇండియన్ ఐడల్‌గా సన్నీ హిందుస్థానీ

by  |
ఇండియన్ ఐడల్‌గా సన్నీ హిందుస్థానీ
X

ఇండియన్ ఐడల్ సీజన్ -11 రియాలిటీ షో విజేతగా అవతరించాడు సన్నీ హిందుస్థానీ. పంజాబ్‌కు చెందిన సన్నీ … ఫైనల్ రౌండ్‌లో పాడిన ‘మేరే రష్కే కమల్’ సాంగ్ ప్రేక్షకులు, న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. జడ్జెస్, ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా సన్నీ హిందుస్థానీ విన్నర్‌గా గెలుపొందగా రూ.25లక్షల ప్రైజ్ మనీ, కారు బహుమతిగా అందుకున్నాడు.

కాగా, మొత్తం ఐదుగురు ఫైనలిస్టులైన సన్నీ హిందూస్థానీ, రోహిత్ రౌత్, అద్రిజ్ ఘోష్. అంకోనా ముఖర్జీ, రిధమ్ కళ్యాణ్ మధ్య పోటీ జరగగా నేహా కక్కర్, విశాల్ దద్లానీ, హిమేష్ రేష్మియా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. హోరాహోరీగా జరిగిన పోటీలో చివరికి సన్నీ హిందుస్థాని ఇండియన్ ఐడల్ ట్రోఫీని అందుకుని చరిత్ర సృష్టించగా రోహిత్ రౌత్ రెండోస్థానాన్ని దక్కించుకుని రన్నరప్‌గా నిలిచాడు. కాగా ఈ సీజన్‌లో నుశ్రత్ అలీఖాన్ పాటలతో మెప్పించాడు సన్నీ.

కాగా ఇండియన్ ఐడల్ సీజన్ – 5లో హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్ చంద్ర గెలుపొందగా… సీజన్ – 9లో ఎల్.వి. రేవంత్ విజేతగా నిలిచాడు.

Read Also..

భర్త గురించి స్నేహ ఎమోషనల్ పోస్ట్

Next Story

Most Viewed