లా నుసియా ఓపెన్ గెలిచిన పన్నీర్ సెల్వం

63
Pannerselvam

దిశ, స్పోర్ట్స్: భారత గ్రాండ్ మాస్టర్ ఇనియన్ పన్నీర్ సెల్వం లా నుసియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. స్పెయిన్‌లో లా నుసియా 9 రౌండ్ల స్విస్ టోర్నమెంట్‌లో పనీర్ సెల్వం 2529 ఎలో రేటింగ్‌తో అజేయంగా నిలవడంతో విజేతగా ప్రకటించారు. ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ ఆండ్రీ సుమెట్స్, చిలీ గ్రాండ్ మాస్టర్ రోడ్రిగో వాస్క్యూజ్ కూడా పన్నీర్ సెల్వంతో సమానమైన పాయింట్లు సాధించారు. అయితే నిర్వాహకులు టై బ్రేకర్ ద్వారా విజేతను ప్రకటించారు. ఫిడే ర్యాంకింగ్స్‌లో 5వ సీడ్ ఆటగాడైన పన్నీర్ సెల్వం 9 రౌండ్ల స్విస్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆరు గేమ్‌లను గెలిచి రెండింటిని డ్రా చేసుకున్నాడు. 8వ గేమ్ అతడికి బై లభించింది. పనీర్ సెల్వం లా నుసియా ఓపెన్ గెలవడంపై సాయ్ మీడియా ట్వీట్‌లో అభినందించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..