పోర్న్ అరాచకం: మియా ఖలీఫా టాటూను అక్కడ వేయించుకున్న ఫ్యాన్.. ఆ తర్వాత

by  |
పోర్న్ అరాచకం: మియా ఖలీఫా టాటూను అక్కడ వేయించుకున్న ఫ్యాన్.. ఆ తర్వాత
X

దిశ, వెబ్ డెస్క్: తమకిష్టమైన వ్యక్తులపై ప్రేమను చూపించడానికి, వారు మనతోనే ఎప్పుడు ఉండాలని కొంతమంది వారి పేర్లను, ఫోటోలను టాటూ వేయించుకుంటారు. ఇంకా కొంతమంది తమకిష్టమైన హీరో పేరు, ఫోటోను టాటూ వేయించుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా ఒక అభిమాని మాత్రం తనకిష్టమైన పోర్న్ స్టార్ బొమ్మను టాటూ వేయించుకొని ఆమెపై అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంతకీ అతనిని అంతలా ఆకట్టుకున్న శృంగారతార ఎవరు అంటే.. ఇంకెవరు.. మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫానే. ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పోర్న్‌స్టార్‌ మియా ఖలీఫా తన వృత్తికి స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. అయినా ఆమెకు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ఇండియాలో కూడా ఆమె అభిమానులు కోట్లలలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఒక భారతీయుడు కూడా ఆమె బొమ్మను టాటూ వేయించుకున్నాడు. తన కాలిపై మియా ముఖాన్ని పోలిన ఒక టాటూ వేయించుకున్నాడు. ఆ వీడియోను ‘టాటూ_ఆర్టిస్ట్_01’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మియా ఖలీఫా.. శృంగార దేవత.. దేవత ఫోటో పచ్చ పొడిపించుకుంటే తప్పేంటి..? అని కొందరు.. సూపర్ భయ్యా .. ఆమెకోసం ఏం చేసినా తప్పులేదు అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో కాస్తా మియా ఖలీఫాకు చేరడంతో మియా ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో షేర్ చేసింది. అలాగే ఊహించని రీతిలో సదరు అభిమానికి షాకింగ్ రిప్లై ఇచ్చింది.

“దయచేసి ఇలాంటి పనులు ఆపండి.. నా ఫోటోను మీ శరీరం పై టాటూ వేయించుకోకండి.. ఇలాంటివి చూస్తే నాకు భయమేస్తుంది. ఫన్నీగా అయినా సరే ఇలాంటివి చేయకండి” అంటూ చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా అభిమానం పీక్స్ లో ఉంటే ఎవరు ఏం చెప్పినా అభిమానులు ఆగరు కదా..



Next Story

Most Viewed