రవిశాస్త్రికి శుభాకాంక్షల వెల్లువ

by  |
రవిశాస్త్రికి శుభాకాంక్షల వెల్లువ
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి బుధవారం 58వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయనకు క్రికెటర్లు, సెలెబ్రిటీలు భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవిశాస్త్రికి శుభాకాంక్షలు తెలిపాడు. కానీ, అక్కడ పోస్ట్ చేసిన ఫొటో, పెట్టిన క్యాప్షన్ అందరిలో ఆసక్తిని రేపుతోంది. రవిశాస్త్రి, ధోనితో కొహ్లీ ఉన్న ఫొటోను పెట్టి ‘అందరూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కానీ, కొందరే ధైర్యవంతులుగా ఉంటారు. హ్యాపీ బర్త్ డే రవిభాయ్’ అని కామెంట్ చేశాడు. తాను ఎంతో ఇష్టపడే రవిశాస్త్రి, ధోనిల ఫొటో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే, కేదార్ జాదవ్, శిఖర్ ధావన్‌లు కోచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story