తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా

by  |
తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా
X

దిశ, స్పోర్ట్స్: భారత జట్టు యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ ఏడాది జనవరి 1న సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాన్‌కోవిచ్‌తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచే ఇద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా తాను తండ్రిని కాబోతున్నట్లు ప్రకటించారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు.. హార్దిక్ తండ్రి కాబోతుంటే నెటిజన్లు మాత్రం విరాట్ కోహ్లిని ఆడుకుంటున్నారు. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకొని పాండ్యా తండ్రయ్యాడని జోకులు పేల్చుతూనే, సీనియర్ జంట కోహ్లి, అనుష్కలు ఎప్పుడు శుభవార్త చెబుతారని అడుగుతున్నారు. ధోని, సాక్షిలు ఐదేండ్ల తర్వాత తల్లిదండ్రులయ్యారు. కానీ, పాండ్యా ఐదు నెలలకే తండ్రి కాబోతున్నాడు. మరి మీరెప్పుడు తల్లిదండ్రులు అవుతారని విరుష్క జోడీని సరదాగా ఏడిపిస్తున్నారు. అభిమానులు సరదాగానే కామెంట్లు పెడుతున్నా కోహ్లి, అనుష్కలకు మాత్రం కాస్త ఇబ్బంది కరంగానే మారింది. ఈ ట్వీట్లపై విరుష్క జంట మాత్రం స్పందించలేదు.


Next Story

Most Viewed