కరోనాను ఎదుర్కొనే సత్తా బ్యాంకులకు ఉందా!?

by  |
కరోనాను ఎదుర్కొనే సత్తా బ్యాంకులకు ఉందా!?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెగ వల్లే ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. రెండు వారాలుగా కరోనా జ్వరం వాణిజ్యంతోపాటు అన్ని రంగాలపై హీట్ పెంచింది. రానున్న రోజుల్లో కరోనా కాగడా నిప్పు పెట్టే అవకాశాలున్నాయనే భయాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల బ్యాంకింగ్ రంగం ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటుందనే కొత్త సందేహం చాలామందిలో మొదలైంది. రూ. 166 లక్షల కోట్లతో బ్యాంకింగ్ రంగం ఇబ్బందులకు చాలాదూరంలోనే ఉందని విశ్లేషకులు కొందరు భావిస్తున్నప్పటికీ… కొన్ని నెలల క్రితం బ్యాంక్ నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) గరిష్ఠ స్థాయి నుంచి 10 శాతానికి పైగా క్షీణించి, లాభదాయకతలోకి వచ్చాయి. తర్వాత టెలికాం ఏజీఆర్ బాధ్యతలు, యెస్ బ్యాంక్ సంక్షోభం వ్యవహారాలు ఆ లాభదాయకతను దెబ్బతీశాయి. గత ఏడేళ్లుగా ఒత్తిడికి గురైన రుణాల కోసం ఆర్‌బీఐ ఆస్తుల నాణ్యతపై సమీక్షలు నిర్వహించింది. దీంతో బ్యాంకులు బ్యాలెన్స్ షీట్ల సమస్యను తొలగించుకున్నాయి. 2016లో నోట్లరద్దు మళ్లీ వారి వ్యాపారాన్ని దెబ్బతీసింది. అనేక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు(ఎమ్ఎస్ఎమ్ఈ)లు తుడిచిపెట్టుకు పోయాయి. ఈ పరిణామాలతో జీఎస్టీ వసూళ్లు క్షీణించాయి. బ్యాంకులు ఎమ్ఎస్ఎమ్ఈలకు ఇచ్చిన రుణాలను పునర్నిర్మించాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి బారి నుంచి బ్యాంకింగ్ రంగం ఎలా తట్టుకుంటుందో పరిశీలిద్దాం!

కన్సాలిడేషన్ మోడ్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు:

ప్రయాణాలు, రవాణా, పర్యాటకం, వాణిజ్యం ఇలా అన్ని రంగాలను కరోనా వైరస్ ప్రత్యక్ష అంతరాయాన్ని కలిగిస్తున్న సమయంలో ప్రభుత్వం మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను 10 పెద్ద బ్యాంకులుగా ఏకీకృతం చేయడానికి సిద్ధమైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకులు యాంకర్ బ్యాంకులుగా హేతుబద్ధీకరణ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఒత్తిడితో కూడిన రుణ ప్రక్రియలు ఇప్పటికే మొదలయ్యాయి. మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకులు వాటి సొంత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇదివరకే దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయిన సంగతి తెలిసిందే. మరో బ్యాంక్ ఐడీబీఐలో ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ బ్యాంకును పునరుద్ధరించేందుకు రూ.35,000 కోట్ల మూలధనాన్ని అందించింది.

ఆర్‌బీఐ పీసీఏ కింద అరడజను బలహీనమైన బ్యాంకులు:

ఆర్‌బీఐ తీసుకునే సకాలంలో దిద్దుబాటు చర్య(పీసీఏ) కింద డజను బ్యాంకులు ఉన్నాయి. కానీ, వాటిలో సగం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, ప్రభుత్వం అందించిన అదనపు మూలధనం కారణంగా తగ్గాయి. పీసీఏ పర్యవేక్షణను అధిగమించడానికి ఈ బ్యాంకుల లాభదాయకత, ఎన్‌పీఏలలో ఎలాంటి మెరుగుదల కనిపించడంలేదు. వాస్తవానికి, రుణాల నుంచి పునఃప్రారంభించడానికి అరడజను బ్యాంకులు బలహీనతలను ఎదుర్కొంటున్నాయి. ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్ష్మీ విలాస్ బ్యాంక్ ప్రస్తుతం ఆర్‌బీఐ పర్యవేక్షణలో పరిమితం చేసిన రుణాలను కలిగి ఉన్నాయి.

ప్రైవేట్ రంగ బ్యాంకులు మినహాయింపేమీ కాదు:

చాలాకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్పొరేట్ తరహా నాయకత్వం వల్ల బలహీన పడ్డాయనే విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే, ఇప్పుడు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా బలహీనతలు బయటపడ్డాయి. అవినీతి ఆరోపణలు, సేవలు ఉల్లంఘించినందుకుగానూ చందా కొచ్చర్, రానా కపూర్ దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నారు. అదేవిధంగా, వారి రికార్డుల్లో పెరుగుతున్న ఎన్‌పీఏలు తప్పుడు రుణాలను చూపించాయి. ప్రస్తుతం పెద్ద ప్రైవేట్ బ్యాంకుల నాయకత్వం కొత్త వ్యూహాలతో కొనసాగుతున్నాయి. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ ఏడాది చివరికి కొత్త నాయకత్వాన్ని చూడనుంది. అలాగే, మరో బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఈ నెలాఖరులో సుమంత్ స్వీకరించనున్నట్టు ప్రకటించింది. నెలరోజులుగా ఈక్విటీలు క్షీణిస్తుండటంతో చాలా ప్రైవేట్ బ్యాంకులు మూలధన సేకరణ ప్రక్రియలో తలమునకలై ఉన్నాయి.

బ్యాంకింగ్ సంస్థలపై నమ్మకం కోల్పోవడం:

ఇన్నేళ్ల కాలంలో తొలిసారిగా ఒక ప్రైవేట్ రంగ బ్యాంకుపై ఆర్‌బీఐ తాత్కాలికంగా మారటోరియం విధించింది. బ్యాంకును పునరుద్ధరించడానికి తాత్కాలిక నిషేధం చివరి అవకాశంగా మారింది. పంజాబ్ సహకార బ్యాంకు, మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్, యెస్ బ్యాంకుల సంక్షోభం మొత్తం బ్యాంకింగ్ పరిశ్రమపై నమ్మకాన్ని సడలించే సమస్యను లేవనెత్తాయి. ప్రభుత్వ సహకారంతో డిపాజిట్ బీమా పరిమితి కింద ఒక్కో బ్యాంకుకు రూ. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెరిగింది. వాస్తవానికి, ఇండియాలోని బ్యాంకులు కొన్ని మినహా మిగిలినవి మూలధనాన్ని సమకూర్చుకున్నాయి. ఇటీవల ఎదురవుతున్న సంక్షోభాలు బ్యాంకింగ్ రంగంపై చిన్న డిపాజిటర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఈ పరిణామాలు, పరిస్థితుల్లో కరోనా ప్రభావం నుంచి బ్యాంకింగ్ రంగం బయటపడే పరిస్థితుల్లో ఉందా అంటే సందేహమే. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆస్తుల వర్గీకరణ, ద్రవ్య లభ్యతపై బ్యాంకులకు ఆర్‌బీఐ నుంచి ఖచ్చితమైన సడలింపు చాలా అవసరమని నిపుణులు భావిస్తున్నారు.

tags: Covid-19, Covid-19 Pandemic, Union Bank Of India, Punjab National Bank, Indian Bank, Bank Merger, IDBI Bank Ltd, Dena Bank, Vijaya Bank, LIC, Chanda Kochar, rana kapoor


Next Story

Most Viewed