మన బ్యాంకుల కంటే బంగ్లాదేశ్ బ్యాంకులు నయం

by  |
మన బ్యాంకుల కంటే బంగ్లాదేశ్ బ్యాంకులు నయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించి తలసరి జీడీపీలో భారత్‌ను బంగ్లాదేశ్‌ను అధిగమిస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ త్రైమాసికానికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాల చిన్న తరహా బ్యాంకుల స్కాక్స్ ఉత్తమ పనితీరును కనిబరిచాయని ఎస్ అండ్ పీ మార్కెట్స్ గణాంకాలు తెలిపాయి.

అయితే, భారతీయ బ్యాంకులు చెత్త ప్రదర్శనను కనబరిచాయని వెల్లడించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 20 అతిపెద్ద బ్యాంకుల్లో 16 బ్యాంకు మార్కెట్ క్యాప్ ఈ త్రైమాసికంలో క్షీణించినట్టు, మొత్తంగా 2020లో భారతీయ బ్యాంకుల స్టాక్స్ క్షీణిస్తున్న ధోరణిలో ఉన్నాయని ఎస్ అండ్ పీ గణాంకాలు పేర్కొన్నాయి. దేశీయ ప్రధాన బ్యాంకులు జనవరి నుంచి ఆగష్టు చివరి మధ్య 12 శాతం నుంచి 50 శాతానికిపైగా నష్టాపోయాయని తెలిపింది.

ఇక, సెప్టెంబర్ త్రైమాసికంలో 66.52 శాతం రాబడితో బంగ్లాదేశ్ సిటీ బ్యాంక్ అగ్రస్థానంలో నిలవగా, భారత్‌కు చెందిన ప్రైవేట్ రంగ దిగ్గజ యెస్ బ్యాంకు ఈ త్రైమాసికంలో 48.63 శాతం క్షీణించి చెత్త ప్రదర్శ్నతో కొనసాగుతోంది. అలాగే, చెత్త ప్రదర్శన జాబితాలో భారత్‌కు చెందిన బ్యాంకులు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఈ త్రైమాసికంలో రెండంకెల ప్రతికూలతను నమోదు చేశాయని గణాంకాలు వెల్లడించాయి.



Next Story