ఆర్మీ కస్టడీలో చైనా జవాన్..అసలు ఏం జరిగిందంటే

by  |
ఆర్మీ కస్టడీలో చైనా జవాన్..అసలు ఏం జరిగిందంటే
X

న్యూఢిల్లీ: చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) జవాను శుక్రవారం తెల్లవారుజామున సరిహద్దు దాటి భారత భూభాగంలో అడుగుపెట్టాడు. లడాఖ్‌లోని దక్షిణ ప్యాంగాంగ్ సో సరస్సు సమీపంలో చుషుల్ సెక్టార్‌లో అతన్ని భారత ఆర్మీ కస్టడీలోకి తీసుకుంది. ఏ పరిస్థితుల్లో ఆయన సరిహద్దు దాటాడో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్టు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, నిబంధనలకు అనుగుణంగానే ఆయనతో వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. సదరు చైనా జవాను దారి తప్పి భారత సరిహద్దులోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. గతంలోనూ ఇలాగే సరిహద్దు దాటి వచ్చిన చైనా జవాను వాంగ్ యా లాంగ్‌ను తూర్పు లడాఖ్‌లోని దెమ్‌చొక్ సెక్టార్‌లో భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. చైనా ఆర్మీ నుంచి అభ్యర్థన వచ్చిన తర్వాత రెండు రోజులకు సదరు జవానును ఆ దేశ ఆర్మీకి అప్పజెప్పింది.

చైనాలో చిక్కిన 39 మంది భారత నావికులు వారం రోజుల్లో స్వదేశానికి..
కరోనా కారణంగా చైనా సముద్ర జలాల్లో కొన్ని నెలలుగా చిక్కుకుని ఉన్న 39 మంది భారత నావికులు వారం రోజుల్లో స్వదేశానికి తిరిగివస్తారని పోర్ట్స్ షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవియ తెలిపారు. రెండు నౌకల్లో చిక్కుకున్న 39 మంది భారతీయులకు సహకరించాలని చైనాను అనేకసార్లు కేంద్రం అభ్యర్థించింది. కానీ, చైనా అందుకు తిరస్కరించింది. భారత నావికులు చైనా జలాల నుంచి జపాన్‌కు చెందిన చిబా పోర్టుకు వెళ్తారని, అక్కడ క్రూ చేంజ్ చేసుకుని భారత్‌కు తిరిగి వస్తారని కేంద్ర మంత్రి వివరించారు.



Next Story

Most Viewed