దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

141
corona, india

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా దేశ వ్యాప్తంగా 39,796 కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ సోకిన వారి సంఖ్య 3,05,85,229కి చేరింది. నిన్న ఒక్కరోజే 723 మంది మరణించగా.. మృతుల సంఖ్య 4,02,728కి పెరిగింది. గత 24 గంటల్లో 42,352 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 2,97,00,430 మంది ఆస్పత్రుల నుంచి పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరారు. ప్రస్తుతం దేశంలో 4,82,071 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా 35,28,92,046 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్‌లో స్పష్టం చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..