- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనాకు భారత్ షాక్.. ఎలా అంటే!
<p>దిశ, వెబ్‌డెస్క్: చైనాకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీలకమైన ఎఫ్‌డీఐ పాలసీని సవరించింది. ఈ నిర్ణయంతో భారత సరిహద్దులను పంచుకునే దేశాల కంపెనీలు మన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకూ ఉన్నట్టు ఆటోమెటిక్ దారిలో దేశంలో ఏ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టే ఛాన్స్ లేదు. సవరించిన ఎఫ్‌డీఐ పాలసీని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల […]</p>

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీలకమైన ఎఫ్‌డీఐ పాలసీని సవరించింది. ఈ నిర్ణయంతో భారత సరిహద్దులను పంచుకునే దేశాల కంపెనీలు మన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకూ ఉన్నట్టు ఆటోమెటిక్ దారిలో దేశంలో ఏ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టే ఛాన్స్ లేదు. సవరించిన ఎఫ్‌డీఐ పాలసీని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీకి సంబంధించి పాలసీ సవరణలను వెల్లడించింది.
ఇండియాలో ఇదివరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లకు రెండు రకాలుగా అనుమతులు ఉండేవి. ఒకటి, ఆటోమెటిక్ మార్గంలో కంపెనీలు మన దేశంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరంలేదు. రెండో మార్గం ఏంటంటే… కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవడం. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో దేశీయ కంపెనీలు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో దేశీయ కంపెనీల బలహీనతలను గుర్తించిన విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు, మన దేశ సంస్థల్లో వాటాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలను మొత్తంగా కొనుగోలు చేసి తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని ఎఫ్‌డీఐ పాలసీలను మార్చింది.
ఈ నిర్ణయం ద్వారా ప్రధానంగా చైనాకు చెక్ పెట్టినట్టు అవుతుంది. మన దేశానికి సరిహద్దుగా ఉన్న పెద్ద దేశం చైనాయే కావడం, అక్కడి సంస్థలు ఎక్కువగా మన దేశ సంస్థల్లో వాటాలను కొనుగోలు చేస్తుండటంతో ఈ వ్యవహారాలన్నింటికి ఒక్కసారిగా చెక్ పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నుంచి ఇండియాతో సరిహద్దు భాగస్వామ్యం ఉన్న ఏ దేశానికి చెందిన సంస్థ అయినా ఇండియాలో పెట్టుబడులు పెట్టాలన్నా, వాటాను కొనుగోలు చేయాలన్నా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఎఫ్‌డీఐ పాలసీ సవరణలతో యాజమాన్య హక్కుల బదిలీలకు కూడా కేంద్రం చెక్ పెట్టింది. పాత ఎఫ్‌డీఐ పాలసీలతో ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు చెందిన కంపెనీలకు మాత్రమే ఇప్పటివరకూ ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఇప్పుడు కొత్త సవరణల ఎఫ్‌డీఐ పాలసీ వల్ల చైనాకు కూడా ఈ అనుమతులు తప్పనిసరి అవనుంది.
ఇటీవల దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీలో చైనా సెంట్రల్ బ్యాంక్ 1.01 శాతం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా సవరణల నిర్ణయం మేరకు ఈ కొనుగోలు చెల్లదని తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం 10 శాతానికి మించి వాటా కొనుగోలు చేసిన వాటికే వర్తిస్తుందని సమాచారం. డిఫెన్స్, ఫార్మాతో సహా మొత్తం 17 రంగాల్లో విదేశీ సంస్థలు ఇచ్చిన పరిమితులకు మించి పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి.
Tags: FDI Norms, FDI Norms Tightens, FDI Policy Changed, FDI Policy Tightened, Lockdown Extension Rules






