పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన భారత్.. ఏ విషయంలో అంటారా?

by  |
anti-terror
X

దిశ వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో నిర్వహించే తీవ్రవాద వ్యతిరేక సైనిక కసరత్తులో పాల్గొనబోవటం లేదని భారత్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ సమావేశాల్లో సభ్య దేశాలు ఈ ప్రతిపాదనలు చేశాయి. దానికి మిగిలిన దేశాలు ఒప్పుకున్న, న్యూఢిల్లీ తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సైనిక విన్యాసాలు ఖైబర్ ఫక్తూన్‌ఖ్వాలో జరగబోతున్నాయి. దీనికి పబ్బీ యాంటీ టెర్రర్- 2021 అనే పేరును పాకిస్తాన్ సూచించింది. అయితే ఇందులో మిగిలిన సభ్య దేశాలు పాల్గొనబోతున్నాయని సమాచారం.

ఉజ్భెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సమావేశంలో 2022-24 సంవత్సరాలకు సంబంధించి యాంటీ టెర్రరిజం, వేర్పాటువాదం, సైనిక ఆపరేషన్లకు సంబంధించిన ముసాయిదాను సభ్య దేశాలు ఆమోదించాయి. అందులో భాగంగానే యాంటీ టెర్రర్ సైనిక విన్యాసాలు జరగబోతున్నాయి. షాంఘై కో ఆపరేషన్ యాంటీ టెర్రరిస్ట్ ప్రధాన కార్యాలయం తాష్కెంట్‌లో ఉంది.

ఫిబ్రవరిలో పాకిస్తాన్ ప్రతినిధులు ఇక్కడికి చేరుకుని యాంటీ టెర్రర్ ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో చైనా, పాకిస్తాన్ దళాలు ఉండటంతో భారత్ ఈ సైనిక విన్యాసాలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో భారత్‌కు చిరకాల వైరం కారణం కాగా, చైనా‌తో భారత్‌కు గత కొంతకాలంగా ఎల్ఏసీ వద్ద ఘర్షణ కొనసాగుతుంది. అందుకే దీనిని తిరస్కరించినట్లు న్యూఢిల్లీ వర్గాల సమాచారం.



Next Story

Most Viewed