మయన్మార్ నాయకురాలి జైలు శిక్షపై స్పందించిన కేంద్రం 

by Shamantha N |

<p>న్యూఢిల్లీ: మయన్మార్ నాయకురాలు అంగ్ సాంగ్ సూకీ జైలు శిక్ష విషయంలో కేంద్రం స్పందించింది. పలు ఆరోపణలపై సూకీకి శిక్ష విధించడం కలవరానికి గురిచేసిందని మంగళవారం పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘తాజా పరిణామాలపై కలవరం చెందాం. పొరుగు ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఎల్లప్పుడు మయాన్మార్‌లో ప్రజాస్మామ్య పరివర్తనకు మద్దతు ఇస్తుంది’ అని అన్నారు. చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియను తప్పనిసరిగా సమర్థించాలని నమ్ముతున్నామన్నారు. ‘తమ దేశం [&hellip;]</p>

Myanmar leader
X

న్యూఢిల్లీ: మయన్మార్ నాయకురాలు అంగ్ సాంగ్ సూకీ జైలు శిక్ష విషయంలో కేంద్రం స్పందించింది. పలు ఆరోపణలపై సూకీకి శిక్ష విధించడం కలవరానికి గురిచేసిందని మంగళవారం పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘తాజా పరిణామాలపై కలవరం చెందాం. పొరుగు ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఎల్లప్పుడు మయాన్మార్‌లో ప్రజాస్మామ్య పరివర్తనకు మద్దతు ఇస్తుంది’ అని అన్నారు.

చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియను తప్పనిసరిగా సమర్థించాలని నమ్ముతున్నామన్నారు. ‘తమ దేశం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, చర్చల మార్గాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అన్ని వైపుల నుండి ప్రయత్నాలు జరగాలని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో మిలటరీ పాలనలోకి వెళ్ళగానే దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో వందల కొద్ది పిల్లలు, పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మయన్మార్ మిలిటరీ కోర్టు అంగ్ సాంగ్ సూకీకి రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

Next Story