ప్రపంచంలో ఆ రంగానికి భారత్ కేంద్రంగా ఉండనుంది: నీతి ఆయోగ్ సీఈఓ

by  |
ప్రపంచంలో ఆ రంగానికి భారత్ కేంద్రంగా ఉండనుంది: నీతి ఆయోగ్ సీఈఓ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఎడ్‌టెక్ రంగానికి భారత్‌ కేంద్రంగా నిలుస్తుందని, ఇందులో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం సహాపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాటి పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా(పీఏఎఫ్ఐ) వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. భారత్‌లో కొత్త ఆవిష్కరణలను తీసుకురావడం ద్వారా గణనీయంగా వృద్ధి సాధించవచ్చని, కొత్త టెక్నాలజీ వినియోగం ద్వారా మరింత మెరుగ్గా వృద్ధికి ఈ పరిణామాలు సహాయపడతాయని వివరించారు.

దేశవ్యాప్తంగా విద్యా రంగాన్ని మెరుగుపరిచేందుకు సరసమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెక్నాలజీ ఆధారిత మౌలిక సదుపాయాలను వీలైనంత ఎక్కువగా అందించడమే దీనికి సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. కేవలం మౌలిక సదుపాయాలపై ఆధారపడితే సరిపోదని అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఎడ్‌టెక్ పరిశ్రమల వృద్ధికి తగిన సామర్థ్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ ఎడ్‌టెక్ పరిశ్రమ దిగ్గజం బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్ మాట్లాడుతూ.. ఎడ్‌టెక్ పరిశ్రమ వృద్ధి ద్వారా విద్యార్థులను నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు.


Next Story