- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో ఒక్కరోజే 95,734 కేసులు..
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే బ్రెజిల్‌ను దాటేసి ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే గడచిన 24 గంటల్లో దేశంలో 95,734 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. అలాగే కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,172 మంది మృతిచెందారు. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73,890 మంది మృతి చెందగా.. చికిత్స అనంతరం 34,71,783 మంది కోలుకున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే బ్రెజిల్‌ను దాటేసి ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే గడచిన 24 గంటల్లో దేశంలో 95,734 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. అలాగే కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,172 మంది మృతిచెందారు.
తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73,890 మంది మృతి చెందగా.. చికిత్స అనంతరం 34,71,783 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో 9,19,018 యాక్టివ్ కేసుల ఉండగా.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కు చేరుకుంది.
Next Story






