అర్జెంటీనాపై ఇండియా విజయం

78

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల హాకీ జట్టు రాత్రి బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రస్తుత ఒలంపిక్ చాంపియన్ అర్జంటీనాపై 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా ఆడిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఇది. భారత ఆటగాళ్లు నిలాకాంత శర్మ (16వ నిమిషం), హర్మన్ ప్రీత్ సింగ్ (28), రూపీందర్ పాల్ సింగ్ (33), వరుణ్ కుమార్ (47) గోల్స్ చేశారు. హోం టీమ్ నుంచి డ్రాగ్‌ఫ్లికర్ (35, 53 నిమిషాల్లో), మైకో క్యాసెల్లా (41) గోల్స్ చేశారు. దీంతో టీమ్ ఇండియా 4-3 తేడాతో గెలిచింది. ‘ఇదొక మంచి ప్రాక్టీస్ మ్యాచ్. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఒలంపిక్ చాంపియన్‌పై గెలవడం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే మ్యాచ్‌లలో ఇదే స్పూర్తిని కొనసాగిస్తాము’ అని భారత కోచ్ గ్రాహమ్ రైడ్ అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..