తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగుల ఆధిక్యం

by  |
india
X

దిశ వెబ్‌డెస్క్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 365 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 160 పరుగుల ఆధిక్యం సాధించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో పంత్ 101 పరుగులతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ 96 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 49, అక్షర్ పటేల్ 43, రహానే 27 పరుగులు చేశారు.

ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4 వికెట్లు పడగొట్టగా.. అండర్సన్ 3, లీచ్ 2 వికెట్లు తీశారు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ చివరి టెస్టు భారత్‌కు అత్యంత కీలకమైనంది. ఈ టెస్టు మ్యాచ్ గెలిస్తే.. సిరీస్‌తో పాటు ఏకంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి టీమిండియా అడుగుపెట్టనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ధీటుగా ఎదుర్కొంటూ భారత్ రాణిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేస్తే టీమిండియా గెలుపు ఇక సునాయాసమే.


Next Story