రూ. 826 కోట్ల బ్యాంకు రుణాలు ఎగనామం

by  |
రూ. 826 కోట్ల బ్యాంకు రుణాలు ఎగనామం
X

దిశ, ఏపీ బ్యూరో: ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా రూ. 826 కోట్లు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చెందిన ఇండ్ – భారత్ ధర్మల్ పవర్ కంపెనీలిమిటెడ్ కంపెనీ ఎగ్గొట్టింది. అప్పులిచ్చిన బ్యాంకులు సీబీఐని ఆశ్రయించాయి. మంగళవారం నుంచి కంపెనీ భాగస్వాములైన ఎంపీ, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల నివాసాలపై సీబీఐ దాడులు చేసింది.

ఏకంగా 11 బృందాలు రంగంలోకి దిగి ఒకేసారి సోదాలు చేసింది. కంపెనీ భాగస్వాముల ఆస్తులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కర్నాటక, ముంబై, సికింద్రాబాద్, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో సీబీఐ దాడులు చేసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె కోటగిరి ఇందిరా ప్రియదర్శిని, బొప్పన సౌజన్య, వీర వెంకట సత్యనారాయణరావు వడ్లమాని, విస్ర్పగడ పేర్రాజు, గోపాలన్మనోహరన్, కే సీతారామ, భాగవతుల ప్రసాద్, నంబూరి కుమారస్వామిపై చీటింగ్తోపాటు ఆర్థికనేరాల కింద సీబీఐ పలు కేసులు నమోదు చేసింది.

ఇండ్ – భారత్ ధర్మల్ పవర్ కంపెనీ కర్నాటకలో పవర్ప్లాంటు నెలకొల్పేందుకు పంజాబ్ నేషనల్బ్యాంకు, యాక్సిస్బ్యాంకు, ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణం తీసుకుంది. తర్వాత కంపెనీని తమిళనాడులోని టుటికోరిన్కు మార్చినట్లు సీబీఐ నమోదు చేసిన కేసులో పేర్కొంది. 2019కు ముందు కూడా ఇదే కంపెనీపై పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు కేసులున్నాయి. కంపెనీ ట్రాక్రికార్డును చూడకుండా బ్యాంకులు ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఎలా ఇచ్చాయనే కోణంలో కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది.


Next Story

Most Viewed