'ప్రస్తుతం ఉత్పత్తి, అమ్మకాలపైనే దృష్టి' 

by  |
ప్రస్తుతం ఉత్పత్తి, అమ్మకాలపైనే దృష్టి 
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ డిమాండ్‌ను తీర్చేందుకు ప్రస్తుతం ఆటో పరిశ్రమ లక్ష్యం కరోనా వైరస్‌ను ఎదుర్కొని ఉత్పత్తి, అమ్మకాలను పెంచడంపై ఉందని ఇండస్ట్రీ బాడీ సియామ్ శుక్రవారం వెల్లడించింది. ఇప్పుడు ముందున్న సవాళ్లను అధిగమించిన తర్వాతే టూ-వీలర్లపై జీఎస్టీ రేటును తగ్గించడం వంటి ఇతర ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సియామ్ తెలిపింది.

‘దేశీయంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కరోనాతో పోరాడేందుకు పరిశ్రమలు శ్రమించాల్సి ఉంది. దానికి తమ సహకారం అన్నివేళలా ఉంటుంది. ఆ తర్వాతే మిగిలిన అంశాలకు ప్రాధాన్యత కల్పించగలమని సియామ్ అధ్యక్షుడు కెనిచి ఆయుకవా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆగష్టులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టూ-వీలర్ వాహనాలు లగ్జరీ ఉత్పత్తులు కావని, అందువల్ల జీఎస్టీ తగ్గింపునకు అర్హత ఉందని చెప్పినట్టు కెనిచి గుర్తుచేశారు. ప్రస్తుతం టూ-వీలర్ వాహనాలపై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది.

అయితే, పరిశ్రమ దీన్ని 18 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. అయితే, కొవిడ్-19 నుంచి బయటపడేందుకు పండుగ సీజన్‌లో ఉత్పత్తి, అమ్మకాలను పెంచడం పరిశ్రమ తొలి ప్రాధాన్యతగా ఉంది. కాబట్టి, జీఎస్టీ రేటు తగ్గింపు అంశాన్ని రానున్న రోజుల్లో మళ్లీ ముందుకు తీసుకెళ్తామని కెనిచి అయుకవా తెలిపారు. పండుగ సీజన్ తర్వాత కూడా డిమాండ్ ఇదే స్థాయిలో కొనసాగుతుందని నమ్ముతున్నాం. ప్యాసింజర్ వాహనాలు 50 లక్షల విక్రయాలను సాధించడం పరిశ్రమ కలగా ఉందని, దాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

Next Story

Most Viewed