ప్రాణం ఉండాలంటే ఆ బెల్టు ధరించండి.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

81

దిశ, డైనమిక్ బ్యూరో: నిత్యం జరుగుతున్న ప్రమాదాలు జనాలు రోడ్డెక్కాలంటే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలి అవ్వాల్సి వస్తోంది. వాహనదారుల్లో చాలా మందికి ట్రాఫిక్ నిబంధనలు కూడా తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీని కారణంగానే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇలా జరుగుతున్న ప్రమాదాలతో నిత్యం వందల మంది మృత్యు ఒడికి చేరాల్సి వస్తోంది. ఇందులో హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి అక్కడికక్కడే చనిపోతున్నారు. అయితే, దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ తెలిపిన నివేదికలో కార్ యాక్సిడెంట్‌లలో ఎలా మరణిస్తున్నారో తెలిపింది. ముఖ్యంగా వాహనదారులు అలసత్వం వహించడంతోనే ఎక్కువ మంది చనిపోతున్నట్లు వెల్లడించారు. కేవలం సీట్ బెల్టు పెట్టుకోకపోవడంతోనే దేశవ్యాప్తంగా రోజుకు 15 మంది వరకు చనిపోతున్నారు. వాహనదారులు చలాన్ల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నట్లు పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..