తెలంగాణలో పెరిగిన ఓటర్లు

by Vadlamudi Anukaran |   (  Updated:2021-01-15 06:55:49  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 21 లక్షల మేరకు అదనంగా పెరిగారు. జనవరి,15, 2021 నాటికి 3,01,65,569 మంది ఓటర్లుగా నమోదైనట్టు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర తుది ఓటర్లు జాబితాను శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 34,708 పోలింగ్‌స్టేషన్లు ఉన్నట్టు పేర్కొంది. ఓటర్ల జాబితాలో పురుషులు 1,51,61,714 మంది ఉండగా&#8230; మహిళా ఓటర్ల సంఖ్య 1,50,02,227 మంది ఉన్నట్టు వెల్లడించింది. ఇందులో థర్డ్‌జెండర్‌ ఓటర్లు [&hellip;]</p>

తెలంగాణలో పెరిగిన ఓటర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 21 లక్షల మేరకు అదనంగా పెరిగారు. జనవరి,15, 2021 నాటికి 3,01,65,569 మంది ఓటర్లుగా నమోదైనట్టు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర తుది ఓటర్లు జాబితాను శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 34,708 పోలింగ్‌స్టేషన్లు ఉన్నట్టు పేర్కొంది. ఓటర్ల జాబితాలో పురుషులు 1,51,61,714 మంది ఉండగా… మహిళా ఓటర్ల సంఖ్య 1,50,02,227 మంది ఉన్నట్టు వెల్లడించింది. ఇందులో థర్డ్‌జెండర్‌ ఓటర్లు 1,628 మంది, ఉండగా సర్వీసు ఓటర్లు 13,703 మంది ఉన్నారు. ఇటీవల 18 ఏండ్లు నిండిన వారు కొత్తగా 2,82,492 మంది ఓటర్లుగా నమోదయ్యారు. కాగా, 2018 ఆసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మొత్తం 2,80,74,722 మంది ఓటర్లున్న విషయం తెలిసిందే.

Next Story