- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తగ్గని పెట్రోల్ ‘మంట’
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుని జీవితానికి భారంగా మారుతుంది. కరోనా లాంటి కష్ట సమయంలో చేతినిండా పనిలేక చేతిలో డబ్బులు లేని సమయంలో పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యున్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. రోజు ఇంధన ధరలు పెరుగుతూ వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 22 పైసలు, డీజిల్‌పై 25పైసలు పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుని జీవితానికి భారంగా మారుతుంది. కరోనా లాంటి కష్ట సమయంలో చేతినిండా పనిలేక చేతిలో డబ్బులు లేని సమయంలో పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యున్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. రోజు ఇంధన ధరలు పెరుగుతూ వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
బుధవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 22 పైసలు, డీజిల్‌పై 25పైసలు పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.66ఉండగా డీజిల్ ధర రూ.87.41ఉంది. ఇక వాణిజ్య నగరమైన ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82 ఉండగా, డీజిల్ ధర రూ.94.84గా ఉంది. ఇక తెలుగురాష్ట్రాలలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.100.46 ఉండగా డీజిల్ ధర రూ.95.28గా ఉంది. అలానే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.64గా ఉంది.






