వర్క్ ఫ్రం హోం చేస్తే.. శృంగారం కష్టమేనా..?

by  |
Enjoy sex life
X

దిశ, వెబ్‌డెస్క్ : శృంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ప్రస్తుత జనరేషన్‌లో టీనేజ్ దశ నుంచే శృంగారంపై అమితాసక్తిని చూపిస్తున్నారు. ఇక కొత్తగా పెళ్లైన జంటలకు ఏడాదిపాటు ఈ ప్రపంచమే కనిపించనంతగా శృంగారంలో ఎంజాయ్ చేస్తారనడంతో సందేహం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం ఒత్తిడి శృంగారంపై పడుతోందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ఇంటి నుంచే పని చేసే వారిపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని తేలింది.

ప్రస్తుతం స్త్రీ, పురుష ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈ సమయంలో వారిలో ఒత్తిడి పెరుగుతుందని ప్రపంచ వ్యాప్తంగా చేసిన సర్వేల్లో తేలింది. ఇంటి నుంచి పని చేస్తుండడం, అధిక పని భారం పడడం, ఇంటి పనులు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఒకవైపు వర్క్ లైఫ్.. మరో వైపు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక డిప్రెషన్ కు గురయ్యే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలాంటి వారు పడక గదిలో సుఖపడలేరని సర్వేలు బహిర్గతం చేస్తున్నాయి.

ఇలా డిప్రెషన్ కు గురయ్యే వారికి పడక గదిలో ఓదార్పు, ప్రేమ లభిస్తే తృప్తికర శృంగారాన్ని ఆస్వాదించవచ్చని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. భాగస్వామి ఇష్టాలకు అనుగుణంగా సెక్స్ లో పాల్గొంటే ఇద్దరికి ఆనందమే. కొందరు మహిళలకు సెక్స్ సమయంలో నొప్పి కలుగుతుంది. అలాంటి వారు కలయికను ఎంజాయ్ చేయలేరు. భాగస్వామిని అర్థం చేసుకుని వైద్యులు సలహ మేరకు నడుచుకుంటే బెటర్.

సెక్స్ పై ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఒత్తిడి. అది పోవాలంటే.. పార్ట్ నర్ తో రొమాంటిక్ గా గడపాలి. అప్పుడు భాగస్వామి రిలాక్స్ అయ్యి శృంగారానికి ఆసక్తి చూపిస్తుంది. కొంతమందిలో ఉండే బద్దకం కూడా సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయనియదు. శృంగారానికి భాగస్వామి రెడీగా ఉన్నా.. అతడి బద్దకం వల్ల వాయిదా వేస్తే డిసాపాయింట్ అవుతారు. సెక్స్ ను ఎంజాయ్ చేయాలంటే మంచి మూడు అవసరం. పని ఒత్తిడి ఎంత ఉన్నా.. దానిని పడక గది దాక తీసుకురాకపోవడం దాంపత్య జీవితానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. భార్య డిప్రెషన్ లో ఉన్నా.. ఆమెను రోమాంటిక్ మూడ్ లోకి తీసుకువచ్చే బాధ్యత భర్తదేనట.



Next Story